google21949f176333b8fd.html

TS NEET UG 2020 Counselling: 4,800 MBBS/ 656 BDS seats available in Telangana




Students who qualified in NEET UG 2020 this year from Telangana State have 4,800 MBBS seats and 656 BDS (dental) on offer in TS NEET 2020 MBBS/ BDS counselling being conducted by Kaloji Narayana Rao University of Health Sciences (KNRUHS, Vijayawada).


The registrations for TS NEET MBBS/ BDS Counselling will end on November 8, 2020.


As far as availability of MBBS seats are concerned for 2020-21 academic year in Telangana State, 1,500 MBBS seats are available in government medical colleges, 2,750 MBBS seats are available in private medical colleges and 550 MBBS seats are available in Minority medical colleges.


This year, a new medical college and a new dental college got approval in Telangana.


As part of TS NEET 2020 MBBS/ BDS counselling, students will be given admissions will be given in 32 medical and 13 dental colleges in Telangana, according to KNRUHS vice chancellor Karunakar Reddy.



4,800ఎంబీబీఎస్‌ సీట్లు

  • ఈ నెల 8తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగింపు

  • కాళోజీ హెల్త్‌ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి

రాష్ట్రంలో ఈ ఏడాది 4,800 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయని కాళోజీ హెల్త్‌వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కరుణాకర్‌రెడ్డి బుధవారం విలేకరులకు చెప్పారు. కరోనా కారణంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని చెప్పారు.



ప్రభుత్వ వైద్యకాలేజీల్లో 1,500, ప్రైవేటులో 2,750, మైనార్టీ కాలేజీల్లో 550 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా ఒక మెడికల్‌, ఒక డెంటల్‌ కాలేజీకి అనుమతి వచ్చినట్టు వివరించారు. ఈడబ్ల్యూఎస్‌ సీట్లు కూడా మంజూరైతే మరో 190 సీట్లు పెరుగుతాయని చెప్పారు.




కొత్త కాలేజీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 32 మెడికల్‌, 13 డెంటల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని డెంటల్‌ కాలేజీల్లో 656 సీట్లు ఉన్నాయని అన్నారు. ఈ నెల 8న అడ్మిషన్ల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌చేసి పీడీఎఫ్‌ డిజిటల్‌ కాపీని జతచేయాలని సూచించారు.




నీట్‌ మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. నీట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో అభ్యర్థులు పొరపాటున ఇతర రాష్ట్రం పేరును నమోదు చేసినా ఆందోళన చెందవద్దని అన్నారు. హెల్త్‌వర్సిటీ నోటిఫికేషన్‌ ఆధారంగా తెలంగాణ, ఏపీ అభ్యర్థులు అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకొని లోకల్‌ క్యాటగిరీని ధ్రువీకరిస్తామని తెలిపారు.  

2020 © TELANGANA FLASH NEWS | ALL RIGHTS RESERVED