google21949f176333b8fd.html

Telangana govt lost Rs 52,750 cr due to Corona




Officials from the Finance department informed Chief Minister Sri K Chandrashekhar Rao that due to the impact of Corona pandemic, in 2020-2021 financial year, the overall loss to the state amounts to Rs 52,750 Crores of revenue. The officers suggested that due to the heavy fall in the revenues, it is necessary to make alterations, changes and amendments to the State’s 2020-2021 Annual Budget.


The CM held a review meeting with the officials from the Finance department here on Saturday, November 7, 2020, at Pragathi Bhavan to assess the State’s financial condition arising out of the Corona Pandemic. The CM held midterm review of the 2020-2021 Budget. State Planning Commission Vice Chairman Sri B Vinod Kumar, Government’s Chief Advisor Sri Rajiv Sharma, Chief Secretary Sri Somesh Kumar, Principal Secretary (Finance) Sri Ramakrishna Rao, Principal Secretary (revenue) Sri Seshadri, Principal Secretary to CM Sri Narsing Rao, Secretary Smt Smita Sabharwal, Special Secretary (Finance) Sri Ronald Ross, officials from the Finance department attended the meeting. In the meeting, the officials from the finance department explained about the prevailing financial situation due to the Corona Virus pandemic:



The state government received Rs 39,608 Crore revenue for seven months from April to October for the financial year 2019-20 through taxes and other non-tax resources. Till October in 2020-21, the state received only 33,704 Crore. The 2020-2021 Budget proposals were prepared estimating that the state’s revenue growth rate would be 15 percent. But due to Corona, the growth did not reach 15 per cent and on the contrary the revues fell compared to last year.


In 2020-2021 financial year it was estimated that the state would receive Rs 67,608 Crore income through taxes and non-tax resources and the Budget proposals were made accordingly. But as per the current estimates the chances for this year are only Rs 33,704 Crore as the income. With this, the state’s own income will be reduced by Rs 33,904 Crore.

The state government’s share in the Central taxes has also decreased considerably. In the Union Budget it is mentioned that for 2020-2021 financial year, the Centre would allocate Rs 16,727 Crore to the State as its (State’s) share. According to this, the state should get Rs 8363 Crore for the financial year 2020-2021 from April to October. But the state received only Rs 6339 Crore from the Centre. As on date there is a reduction of Rs 2025 Crore in the taxes. By the end of financial year 2020-2021, it is estimated that the state would get Rs 11,898 Crore instead of Rs 16,727 Crore, which was its actual due. With this, the state would lose Rs 4,829 Crore.



Under several centrally sponsored and assisted schemes, the Centre for 2020-2021 financial year has to give Rs 9725 Crore to the state. By this, the state should get Rs 5673 Crore by October but only Rs 4592 Crore was received. There is a loss of Rs 1081 Crore from the central funds that are supposed to be received by October end. By end of this financial year, the state may get Rs 8923 Crore instead of Rs 9725 Crore. There will be Rs 802 Crore cut in the centrally sponsored and assisted schemes’ funds.


The CM said that since there will be a shortfall of Rs 52,750 Crore in the state’s overall income he instructed the officials concerned to fix priorities accordingly and prepare financial management plan.


కరోనా ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్ని విధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020-21 బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అధికారులు సూచించారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితిని వివరించారు.

- రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి 39,608 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు రూ.33,704 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. కానీ, కరోనా వల్ల పెరగాల్సిన 15 శాతం పెరగక పోగా, గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం 67,608 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ కేవలం రూ.33,704 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఏడాది ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.33,904 కోట్లు తగ్గనుంది.

- రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ. 8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,025 కోట్లు తగ్గాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లకు గాను కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల్లో వాటా రూ.4,829 కోట్లు తగ్గనున్నాయి.

- వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది. దీని ప్రకారం అక్టోబర్ నెల వరకు రూ.5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.4,592 కోట్లు వచ్చాయి. అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 9,725 కోట్ల రూపాయలకు గాను, 8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో 802 కోట్ల రూపాయలు కోత పడే అవకాశం ఉంది.

రాష్ట్రానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

4 views

2020 © TELANGANA FLASH NEWS | ALL RIGHTS RESERVED