Iconic Durgam Cheruvu Cable Bridge in Hyd thrown open to public

The Minister for Municipal Administration and Urban
Development Sri. KT Rama Rao inaugurated the state-of-the-art
extradosed Cable Stayed Bridge across Durgam Cheruvu today on Friday, September 25, 2020.
Principal Secretary Municipal Administration Arvind Kumar today
said that the coveted ‘Army Ceremonial and Symphony Band’ of the
Indian Army will be performing live from 5.30 PM on Saturday (on the
bridge) to commemorate the opening of the cable stayed bridge across
Durgam Cheruvu. He invited the public to take part in the programme
and enjoy the live band performance.
As the vehicular movement is restricted on the bridge during the
weekend and the public will be able to enjoy performance from the
other side of the carriageway. Mr Arvind Kumar observed that with the
bridge being equipped with aesthetically pleasing lighting and the band
performing against the beautiful lake backdrop, it is expected to be
quite a spectacle.
He said that the band will perform to express solidarity with the
Indian Soldiers posted on the Northern Borders and to the GHMC
sanitation Corona Warriors.
Mr Arvind Kumar informed that the Army Symphony Band, will be
performing will be performing for 45 minutes on the iconic cable stayed
bridge in order to popularize the iconic bridge. Starting with ‘Vande
Matram’, the band will play several patriotic, Indian and western songs
and music and end the night with ‘Jai Ho’.
He added that after the Army Band, another local Hyderabad
band led by Ms. Anisha will be performing on Indian and western songs
and keep the public entertained.
దుర్గం చెరువు సరస్సు పై నిర్మించిన అత్యాధునిక , అత్యధిక శక్తివంతమైన తీగల
ఆధారిత వంతెనను పురపాలక పరిపాలన, పట్టణఅభివృద్ధి, శాఖా మాత్యులు శ్రీ కె.టి.రామా
రావు శుక్రవారం ప్రారంభించారు.
దుర్గం చెరువు పై శక్తివంతమైన తీగల ఆధారిత వంతెన ప్రారంభాన్ని పురస్కరించుకొని
శనివారం సాయంత్రం 5.30 గంటలకు వంతెన పై ఆర్మీ సెరమోనియల్ మరియు సింఫోనీ
బ్యాండ్ ను ఇండియన్ ఆర్మీ ద్వారా ప్రదర్శిస్తారని పురపాలక, పట్టణఅభివృద్ధి శాఖ ముఖ్య
కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరు ఉత్సహంగా పాల్గొని
లైవ్ బ్యాండ్ ప్రదర్శనను తిలకించాలని ఆహ్వనించారు.
ఈ వారాంతంలో వంతెన పై వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించి వేరొక వైపు
వున్న క్యారేజ్ వే ద్వారా ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించి సంతోషించేలా ఏర్పాట్లు
చేస్తున్నామన్నారు. అత్యంత సుందరమైన లైటింగ్ , సరస్సు యొక్క బ్యాక్ డ్రాఫ్ ద్వారా
బ్యాండ్ ప్రదర్శన ప్రజల మనసులలో చిరస్థాయిలో నిలచిపోనున్నదని ముఖ్య కార్యదర్శి
అన్నారు. నార్తన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు , జి.హెచ్.యం.సి
శానిటేషన్ కరోనా వారియర్ల సేవల నిర్వహణకు సంఘీభావాన్ని తెలియజేసేలా బ్యాండ్
ప్రదర్శన ఉంటుందని ముఖ్యకార్యదర్శి తెలిపారు.
ఈ ఐ కానిక్ వంతెన ను పాపులరైజ్ చేయడానికి ఆర్మీ సింఫోనీ బ్యాండ్ తీగల వంతెన
పై 45 నిమిషాల పాటు ప్రదర్శన ఇస్తారని ముఖ్య కార్యదర్శి తెలిపారు. “వందేమాతరం” తో
ప్రారంభించి పలు దేశ భక్తి, భారతీయ , పాశ్చాత్య గీతాలు, మరియు సంగీతాన్ని ప్రదర్శించి
“జయ హో ” తో ముగిస్తారని అన్నారు.
ఆర్మీ బ్యాండ్ ప్రదర్శన అనంతరం Ms.అనీశా సారధ్యంలో స్థానిక బ్యాండ్ , ఇండియన్
, వెస్టన్ పాటలను ప్రజల వినోదం కోసం ప్రదర్శిస్తారని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ
అర్వింద్ కుమార్ తెలిపారు.