google21949f176333b8fd.html
 

Flat/ plot/ home registrations commence in Telangana from Dec 11, 2020 after 3 months




PRESS RELEASE


Telangana High Court on December 10, 2020, Thursday, has permitted the commencement of registrations in respect of non-agricultural properties in Telangana with 100% advance slot booking.


Slot bookings can be made by the interested citizens online after full payment of requisite fees and duties as determined by the software.



It is proposed to enable the facility for slot booking on the registration department website from 11th December 2020, Friday. Registrations of transactions at Sub-Registrar offices are proposed to be commenced as per the slots allotted from 14th December 2020 onwards.


·Only persons with valid slots should visit their respective Sub-Registrar Offices on the date and time allotted to them.


·No transactions/ registrations would be possible without advance slot booking.


Property registrations were halted in Telangana since September 7, 2020 to enable launch of Dharani portal to make property transactions entire online.


At present, only registration of agriculture properties is done through Dharani portal.


The registration of non-agriculture properties is done in the old method through registrations department portal as case on Dharani portal is pending in the High Court.


O/o Chief Secretary,

Telangana State


పత్రికా ప్రకటన

తేది.11.12.2020


స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ లాంఛనంగా శుక్రవారం బిఆర్ కెఆర్ భవన్ లో ప్రారంభించారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి విజన్ మేరకు గౌరవ హైకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ద్వారా పారదర్శకంగా, సులభతరంగా, ఎటువంటి విచక్షణ లేకుండా ఆన్ లైన్ పద్ధతి ద్వారా జరుగుతాయని సి.యస్ తెలిపారు.


ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభమైన పద్ధతిలో ఆస్తుల విలువల కనుగుణంగా ఆన్ లైన్ పద్ధతిలో, నెట్ బ్యాంకింగ్ ద్వారా చలాన్ కనుగుణంగా చెల్లింపులు చేసుకొని తదనంతరం బుక్ చేసుకున్న స్లాట్ కు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళవలసి ఉంటుందని సి.యస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి పాత చార్జీలే అమలు లో ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేయవలసిన ప్రాపర్టీ వివరాలు నమోదు చేయగానే సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీ, స్టాంపు డ్యూటి, ఇతర చార్జీల చెల్లింపు వివరాలు జనరేట్ అవుతాయన్నారు. ఆధార్ ఇవ్వని వారికోసం ప్రత్యేక పద్ధతిని పాటిస్తామన్నారు.


ప్రస్తుతం ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ లను కేటాయిస్తామని, డిమాండ్ మేరకు వాటిని పెంచడం జరుగుతుందన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు వార్ రూం లో పనిచేస్తున్న టెక్నికల్ టీం పరిష్కరిస్తుందని సి.యస్ తెలిపారు.

రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ కోసం www.registration.telangana.gov.in అనే వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవలసి ఉంటుందన్నారు. స్లాట్ బుకింగ్ కోసం TPIN, PTIN Assessment Number లను ఫీడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇవి లేని వారు local bodies ధరఖాస్తు చేయగానే 2 రోజులలో వారికి అధికారులు PTIN నెంబరును జారీ చేస్తారన్నారు. ప్రస్తుతం 96 శాతం నుండి 97 శాతం దాకా రిజిస్ట్రేషన్ సర్వీసులను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న సమయానికి అనుగుణంగా కొనుగోలుదారులు, అమ్మకం దారులు, సాక్షు లు తమ ఐడి ప్రూఫ్ ల తో హాజరుకావలసి ఉంటుందన్నారు.


ప్రస్తుతం సేల్, మార్టిగేజ్ విత్ పొసెషన్, మార్టిగేజ్ విత్ అవుట్ పొసెషన్, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్, గిఫ్ట్, డెవలప్ మెట్ అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ విత్ అవుట్ పొసెషన్ లాంటి సర్వీసులు లభిస్తాయని సి.యస్ తెలిపారు.


డాటా సిస్టమ్ కు సంబంధించి అవసరమైన సెక్యూరిటి వ్యవస్ధను ఏర్పాటు చేసామన్నారు. 24 లైన్ల తో కాల్ సెంటర్ పనిచేస్తుందన్నారు. కాల్ సెంటర్ నెంబర్ 18005994788 కు ఫిర్యాదు చేస్తే ఐటి శాఖ పరిష్కరిస్తుందన్నారు.


రియల్ ఎస్టేట్ బిల్డర్లకు ప్రత్యేకంగా ధరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పించామని సి.యస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం e-pass book జారీ అవుతుందని, 7 నుండి 10 రోజుల లోపు Regular pass book జారీ చేయడం జరుగుతుందన్నారు.


ప్రజల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. వ్యవసాయ రిజిస్ట్రేషన్ కు సంబంధించి 55216 లావాదేవీలు జరిగాయని, ధరణికి 1.24 కోట్ల హిట్స్ వచ్చాయని, 74 వేల స్లాట్ బుకింగ్ లు జరిగాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ శాఖ సిఐజి శ్రీ శేషాద్రి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ, ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, TSTS MD శ్రీ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

----------------------------------------------------------------------------

జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం




6 views